ఆరుగురు గురుకుల స్టూడెంట్స్ మిస్సింగ్..సూర్యాపేట జిల్లా నెమలిపురి స్కూల్ లో ఘటన

ఆరుగురు గురుకుల స్టూడెంట్స్ మిస్సింగ్..సూర్యాపేట జిల్లా నెమలిపురి స్కూల్ లో ఘటన

కోదాడ, వెలుగు : ఆరుగురు టెన్త్ విద్యార్థులు ఆదివారం ఉదయం అదృశ్యమైన ఘటన  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకుల స్కూల్ లో జరిగింది. సమాచారం మేరకు శనివారం రాత్రి జరిగిన విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీలో కొందరు మితిమీరి ప్రవర్తించారు. దీంతో ఆదివారం ఉదయం వారిని పిలిచి స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు.

అయితే ఆ విద్యార్థులు లంచ్ తర్వాత ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. సాయంత్రం వరకు కనిపించకపోవడంతో టీచర్లు ఆచూకీ కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాకబు చేశారు.  దీంతో పేరెంట్స్ స్కూల్ వద్దకు వెళ్లి తమ పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ కోదాడ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.